Crime Love: ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందులో ఒకరు హిజ్రాగా మారడానికి సర్జరీ కోసం దొంగతనాలు చేశారు. ఇంస్టాగ్రామ్ పరిచయంతో భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు. చోరీలు బయటపడడంతో పోలీసులకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా యాదవోలు. 3 ఏళ్ల కిందట కాకినాడ జిల్లా తునికి వచ్చాడు. తాను అమ్మాయిగా మారాలని అనుకుంటున్నానని.. శరీరంలో ఆ లక్షణాలు ఉన్నాయని లోకల్‌గా ఉన్న హిజ్రాలతో కలిశాడు. శరీరంలో మార్పుల వల్ల తాను అబ్బాయిలా ఉండలేకపోతున్నానని వాళ్లతోనే జీవించడం మొదలుపెట్టాడు. సతీష్ పేరును అవంతిక రెడ్డిగా మార్చుకున్నాడు. ఇదీ ఆ పేరు వెనక ఉన్న స్టోరీ.
Off The record: తెలంగాణ కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలు
ఇక రాత్రి వేళల్లో హిజ్రాలతో కలిసి లేడీ గెటప్ వేసుకుని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు సతీష్. పండుగలు, జాతరలలో ప్రత్యేక పర్ఫామెన్స్‌లు ఇచ్చేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తునికే చెందిన ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. తునిలో ఇద్దరు కలిసి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని భార్యాభర్తలమని చెప్పుకుని జీవిస్తున్నారు. అయితే అవంతిక రెడ్డి తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్‌ని కోరింది. సర్జరీ చేయించుకుని పూర్తిగా హిజ్రాగా మారితే తాను పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంక్వయిరీ చేశారు. ముంబై వెళ్లి సర్జరీ చేయించుకోవాలని అవంతిక రెడ్డి డిసైడ్ అయింది. దానికోసం 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో.. ఆ డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కారు. తాము అద్దెకి ఉన్న పక్కింటినే టార్గెట్‌గా చేసుకున్నారు.. చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో సర్జరీ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకోవచ్చని ఫిక్స్ అయ్యారు.
ఇంటి పక్కన సత్యవతి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె దగ్గర బంగారం ఉండడంతో దానిని కొట్టేస్తే తాము అనుకున్నది జరుగుతుందని ప్లాన్ చేశారు ప్రశాంత్, అవంతిక. అర్ధరాత్రి ఆమె వాష్ రూమ్‌కి బయటకు వచ్చినప్పుడు కళ్ళల్లో కారం కొట్టి చేతులతో నోటిని మూసేసి ఇద్దరు బంగారంతో పారిపోయారు. బంగారు గొలుసు, బంగారు గాజులను తీసుకుని పరారయ్యారు. సత్యవతితో పాటు ఇంట్లో మూగ, చెవిటి కూతురు మాత్రమే ఉంటుంది. దాంతో ఆ ఫ్యామిలీ అయితే దొంగతనానికి ఈజీగా ఉంటుందని ప్లాన్ చేశారు. అడగడానికి కూడా ఎవరూ ఉండరని అనుకున్నారు.
Mahbubnagar: రేబిస్ ఫోబియా.. తల్లి, కూతురుని బలి!
అంతా బాగానే ఉంది.. కానీ చిన్న పేపర్ వారిని పోలీసులకు చిక్కేలా చేస్తుందని ఊహించలేకపోయారు. దొంగతనం విషయాన్ని సత్యవతి, ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సగం కట్ చేసి ఉన్న పేపర్ ముక్క ప్రశాంత్, అవంతిక ఉంటున్న అద్దె ఇంట్లో దొరికింది. ఘటనా స్థలంలో కట్ చేసిన పేపర్ ముక్కతో అది మ్యాచ్ అయింది. దీంతో వారిద్దరినీ దొంగలుగా గుర్తించారు. ఇద్దరిని ఆరెస్ట్ చేశారు.
వారి దగ్గర నుంచి బంగారం, బైక్, 2 ఆండ్రాయిడ్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 7 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దొంగతనం విచారణ జరుగుతుంది కాబట్టి కొద్ది రోజులు పోయాక ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుందామని ప్లాన్ చేశారు. ఇప్పుడే వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి జాగ్రత్త పడ్డారు.. ఇంతలోనే పోలీసులకు చిక్కారు. మొత్తానికి అతడు ఆమెగా మారడానికి సర్జరీ కోసం చోరీలు చేశారు. పెళ్లి చేసుకుందామని అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్ అయ్యారు. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. వీళ్ల వ్యవహారం బయటపడడంతో హిజ్రాలు ఉంటున్న ఏరియాల వాళ్లు ఉలిక్కి పడుతున్నారు.