Kovvur Midnight Clash: తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి నేతలు అర్ధరాత్రి నడిరోడ్డుపై కుమ్ములాడుకున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సమక్షంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో జనసేన శ్రేణులు రసభస చేశారు. దీంతో జనసేన నాయకులపై దారి కాసి మరీ కూటమి నేతలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఇక, ఈ దాడికి నిరసనగా అర్ధరాత్రి దొమ్మేరు సెంటర్లో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు.
Read Also: YSRCP Annadata Poru: నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరుబాట.. పర్మిషన్ లేదంటున్న పోలీసులు
అయితే, మూకుమ్మడిగా దాడి చేసిన కూటమి నేతలపై కేసులు నమోదు చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష విరమించేది లేదంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ దీక్ష శిబిరానికి విచ్చేసి వివరాలు సేకరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తామని జనసేన శ్రేణులకు డీఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే, దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు సైతం వెళ్లడంతో.. కొద్దీగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.