మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది.. ఈ నెలలో దాదాపు నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించగా… ఇవాళ ఉదయం 6.73 గంటల ప్రాంతంలో మరోసారి తీవ్రమైన భూకంపం వచ్చింది… దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.. సులవేసి కొటమోబాగుకు 779 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. కాగా, ఈ మధ్య ఇండోనేషియాను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి.. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు…
ఆఫ్ఘనిస్తాన్‌ను భూకంపం వణికించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3 గా నమోదైంది. భూకంపం తాకిడికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. శిధిలాల కింద చిక్కుకొని 26 మంది మృతి చెందారు. తుర్కుమెనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బాద్గిస్ ప్రావిన్స్‌లో వరసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదటిసారి వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా ఉండగా, రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. రెండు భూకంపాల ధాటికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి.…
తెలంగాణలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి… ఇవాళ మధ్యాహ్నం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. ఇక, ఊహించని ఘటనలో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. దమసాపూర్, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామల్లో కూడా భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఇక, ఈ సమయంలో భూమి నుంచి భారీ శబ్ధాలు వచ్చినట్టు తెలుస్తోంది.. భూమి కింది…
శ్రీకాకుళం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని ఇచ్చాపురంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు కవిటి, కంచిలి మండలాల్లోనూ భూమి కంపించింది. గత వారం రోజులలో రెండోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. Read Also: ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా? ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని…
కొన్ని ప్రకృతి విపత్తులు అనుకోకుండా విరుచుకుపడతాయి.. అయితే, వాటి గుట్టును విప్పడానికి అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే తుఫాన్లు ఎక్కడ పుడతాయి.. ఎక్కడికి వెళ్తాయి.. ఎక్కడ తీరం దాటతాయి అనేదానిపై నిర్దిష్టమైన అంచనాలు వచ్చేస్తున్నాయి.. ఇక, భూకంపానికి సంబంధిచిన హెచ్చరికలు కూడా ముందే వస్తున్నాయి.. తాజాగా, అమెరికాలోని భూకంపానికి సంబంధించిన హెచ్చరికలు ముందుగానే రాగా.. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో భూకంపం వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.…
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి…
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల…
విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. Read Also: నాలుగు రాష్ట్రాలలో…
ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల…
మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి.. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు… మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ కదలికలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపననల…