An earthquake hits Uttarakhand:ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. డెహ్రాడూన్ తో పాటు పలు నగరాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Earthquake in Gadchiroli district: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. తెలంగాణలో సరిహద్దులను అనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లా దక్షిణ ప్రాంతం సిరోంచా తాలుకాలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది.
Earthquake hits Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉత్తరాన అచే ప్రావిన్స్ లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణా నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఇచ్చిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. సునామీ వార్తల నేపథ్యంలో…
Papua New Guinea earthquake: ద్వీపదేశం పాపువా న్యూగినియాలో ఆదివారం ఉదయం తీవ్రమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లూడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 74కి చేరుకుందని స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 21 మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదించింది.
Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి.