ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల…
మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి.. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు… మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ కదలికలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపననల…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్‌లో…
సముద్రతీరంలో అలలు ఎలా విరుచుకుపడుతుంటాయో చెప్పక్కర్లేదు. మామూలు సమయాల్లో కూడా అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని సముద్రపు అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. అయితే, మంగళవారం రోజున రాజోలు నుంచి సముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.1 గా నమోదైన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తరువాత సముద్రంలో సడెన్‌గా మార్పులు కనిపించాయి. ఎప్పుడు అలలతో…
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపణలు కలకలం సృష్టిస్తున్నాయి… వికారాబాద్ జిల్లా తాండూరు – కర్ణాటక సరిహద్దుల్లోని సేడం చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చిందని చెబుతున్నారు స్థానికులు… అర్ధరాత్రి భూప్రకంపణలు సంభవించడంతో… ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు… రాత్రి అంతా ఇళ్లబయటే గడిపినట్టుగా తెలుస్తోంది.. సేడం, చించౌలి నియోజక పరిధిలోని.. దాదాపు 20 గ్రామాల్లో భూకంపం వచ్చింది… కేరెలి, బూతుపూర్, చింతకుంట, భూర్గుపల్లి, నుదిగొండ, అలచెర, వాజ్ర, కోండంపల్లి, బోక్తంపల్లి, రైగొడ సహా తదితర…
అండమాన్ దీవుల్లో గురువారం అర్థరాత్రి దాటిన అనంతరం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో రాత్రి 1.37 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. నికోబార్ దీవిలోని క్యాంప్ బెలే బే నుంచి 640 కి మీ దూరంలో.. భూమికి పది కిమీ లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్సీఎస్ పేర్కొంది. గురువారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్ లోని కత్రా, యూపీలోని…
శనివారం రోజున కరేబియన్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప విధ్వంసానికి వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1300 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ ఓ…
7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతలలో భూమి స్వల్పంగా కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఉదయం 5 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే, భూప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పోరల్లోకి నీరు చేరడం వలన భూప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. …