Earthquake: పెరూలో భారీ భూకంపం.. 7.2 తీవ్రతతో కంపించిన భూమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం ఉంది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పెరు తీరాన్ని అనుకుని ఉన్న పసిఫిక్ సముద్రంలో నాజ్కా టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది తూర్పు ఈశాన్య దిశగా 71 మి.మీ కదలుతోంది. దీంతో నాజ్కా, అమెరికా ప్లేట్లు పరస్పరం ఢీకొనడంతో భూకంపాలు నమోదు అవుతున్నాయి. ఈ ప్రాంతంలో చాలా లోతులో భూకంపాలు వస్తాయి. గతంలో భూమికి 600 కిలోమీటర్ల లోతులో కూడా భూకంపాలు సంభవించాయి. ఇదిలా ఉంటే తాజా భూకంపం భూమి లిథోస్పియర్ పొరలో సంభవించింనట్లు నిపుణులు చెబుతున్నారు. పెరూ- చిలీ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ భూమి ఉపరితలం కింద నిరంతరం టెక్టానిక్స్ ప్లేట్స్ నిరంతరం స్థానభ్రంశం చెందుతుంటాయి.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!