శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది.
Earthquake in Jaipur: రాజస్థాన్లోని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో 3 సార్లు భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది.
లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్లో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి తీవ్రంగా కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని జియోలాకల్ సర్వేలో పేర్కొనింది.
అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.