Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Earthquake: పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
శనివారం నుంచి 8 సార్లు భూకంపం సంభవించింది. ప్రావిన్సులోని హెరాత్ పట్టణానికి వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ప్రాంతాలను భూకంప కుదిపేసింది. చాలా వరకు మట్టితో కట్టిన ఇళ్లు కావడం, కొండచరియల ప్రాంతాల్లో నివాసాలు ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 4200 మంది ప్రజలు భూకంపం ధాటికి ప్రభావితమయ్యారు.
Also Read
- Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
Read Also: Nushrratt Bharuccha: ఇజ్రాయిల్‌లో క్షేమంగా బాలీవుడ్ నటి.. ఇండియాకు పయణం..
హెరాత్ ప్రావిన్సు ఇరాన్ తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ ప్రాంతంలో 1.9 మిలియన్ల మంది నివసిస్తున్నారు. హిందూకుష్ ప్రాంతంలో ఉండే ఈ ప్రావిన్సులో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో నేల అంతర్బాగాన యురేషియా టెక్టానిక్ ప్లేట్, ఇండియా టెక్లానిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది. ఈ పలకలు తరుచుగా ఒకదానితో ఒకటి ఢీకొట్టడం మూలంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత ఏడాది జూన్‌లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు మరియు పదివేల మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Rajkumar Periasamy: ‘ఓం’ సినిమాలో ఆ సందేశం ఉండదు.. రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌కుమార్!
-
MS Dhoni: “ధోనీ ఆట, హెయిర్‌స్టైల్‌కు నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు ఫిదా”.. 20 ఏళ్ల నాటి ఘటనను గుర్తుచేసిన రాజీవ్ శుక్లా
-
BMW R 12 G/S: రూ.25.40 లక్షలతో BMW కొత్త బైక్ లాంచ్.. 1170cc ఇంజిన్, 109hp పవర్, ఆఫ్‌రోడ్ ఫీచర్లు!
-
Dulquer Salmaan: దుల్కర్ సడెన్ సర్ప్రైజ్.. కొత్త సినిమా టైటిల్ ఇదేనట!
-
Tadepalligudem: తాడేపల్లిగూడెంలో కలకలం.. వైసీపీ అభ్యర్థి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!