Sun In Middle Age: మనకు వెలుగునిచ్చి, శక్తిని ఇచ్చి.. సౌరమండలానికి కీలకమైన సూర్యుడు ప్రస్తుతం నడి వయస్సుకు చేరుకున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనల్లో తేలింది. సూర్యుడు ఏర్పడి ఇప్పటి వరకు 4.57 బిలియన్ సంవత్సరాలు అయింది. సూర్యుడిపై ఇటీవల కాలంలో సౌరజ్వాలలు, బ్లాక్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి నడి వయస్సు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. దీని కారణంగానే గత రెండు వారాల కాలంగా సూర్యుడి వాతావరణం మరింత…
Tsunami eruption from Sun: సూర్యుడు ప్రమాదకరంగా మారుతున్నాడు. ఒకవైపు బ్రిటన్‌లో సూర్యుడు మండిపోతుంటే.. మరోవైపు సూర్యుడి నుంచి విస్పోటనాలు జరుగుతున్నాయి. సాధారణంగా సూర్యుడు నిత్యం భగభగ మండుతుంటాడు. ఈ నేపథ్యంలో సూర్యుడి నుంచి విస్పోటనాలు జరగడం మాములు విషయమే. కానీ అతి భారీ విస్పోటనాలు జరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ ఇతర గ్రహాలపై పడుతుంది. అప్పుడు సూర్యుడి నుంచి ఊహించని స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. దీనినే కరోనల్ మాస్ ఎజెక్షన్‌గా పిలుస్తారు. ప్రస్తుతం సూర్యుడిపై…
సూర్యడిపై భారీ విస్పోటనం జరిగింది. దీంతో భారీ సౌరజ్వాల భూమి వైపు వస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సౌరజ్వాల భూమిని తాకితే భూమిపై కమ్యూనికేషన్, జీపీఎస్, రేడియో సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రేడియో బ్లాక్ అవుట్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూర్యుడు ప్రస్తుత తన 11 సంవత్సరాల సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి వాతావరణం క్రియాశీలకంగా మారింది.సూర్యుడిపై భారీగా సౌర…
ఆకాశంలో అద్బుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రానున్నాడు. దీంతో సూపర్ మూన్ ఏర్పడబోతోంది. 2022లో మొత్తం నాలుగు సార్లు సూపర్ మూన్ కనువిందు చేయనున్నాయి. తాజాగా ఏర్పడుతున్న సూపర్ మూన్ మూడోది. తరువాతి సూపర్ మూన్ ఆగస్టు 12న కనిపించనుంది. పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించిన సందర్భంలో, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో ఈ సూపర్ మూన్…
సైన్స్ డెవలప్ అయి కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విశ్వం అంతుపట్టని స్థితిలోనే ఉంది. ఇప్పటివరకు మనం ఈ విశ్వం గురించి తెలుసుకుంది సముద్రంలో నీటి బొట్టంతే. మన సౌర వ్యవస్థకు మూలం అయిన సూర్యుడి గురించే ఇంకా అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర తుఫానులు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా సూర్యుడిపై ఏర్పడిన ఓ ‘‘సన్ స్పాట్’’ ప్రత్యేకంగా మారింది. ఏఆర్3038…
భూమి గురించి ఎంత తెలుసుకున్నా.. ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇన్నాళ్లు మనం భూమి మధ్యలో పెద్ద ఐరన్ కోర్ భూమికి భ్రమణానికి వ్యతిరేఖ దిశలో తిరుగుతుందని మనందరికీ తెలుసు. భూమి ఇన్నర్ కోర్ సాలిడ్ గా ఉండీ, ద్రవరూపంలో ఉండే ఐరన్ లో తిరుగుతుండటంతో ఇది జెనరేటర్ గా పనిచేస్తూ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తోంది. భూ అయస్కాంత క్షేతం( జియో మాగ్నిటిక్ ఫీల్డ్) వల్లే గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఈ బలమైన అయస్కాంత క్షేత్రమే…
అంతరిక్షంలో తరచూ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొస్తాయి.. కొన్ని సార్లు ప్రమాదం జరిగినా.. చాలా సార్లు ప్రమాదాలు తప్పాయి.. అయితే, అంతరిక్షం నుంచి మరో ప్రమాదం రాబోతోంది.. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని చెప్పింది. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే…
భూమిపై జీవం ఆవిర్భవించి ఎన్ని కోట్ల సవంత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవంలో మార్పులు జరుగుతూనే ఉన్నది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకు ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుకకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. భూమి పుట్టుకకు సూపర్ మౌంటైన్స్ కారణమని తేల్చారు. ఈ సూపర్ మౌంటెయిన్స్ భూమిపై రెండుసార్లు ఉద్భవించాయని గుర్తించారు. రెండు వేల నుంచి 1800 మిలియన్ సంవత్సరాల…
మనం నివశించే భూమిపై మూడు వంతులు సముద్రం ఉండగా ఒక భాగం మాత్రమే మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇతర అవసరాలు తీరుతున్నప్పటికీ, నేల పెరగడం లేదు. దీంతో భూమికి విలువ భారీగా పెరిగిపోయింది. గజం స్థలం విలువ వేల రూపాయల్లో ఉంది. అయితే, భూమి మోత్తం విలువ ఎంత ఉంటుంది అనే దానిపై ఆస్ట్రోఫిజిసిస్ట్ గ్రెగ్‌లాగ్‌లిన్ అనే వ్యక్తి ఎస్టిమేషన్ వేశారు. వయసు, స్థితి, ఖనిజాలు, మూలకాలు తదితర అంశాలను…
గతేడాది డిసెంబర్ 25 వ తేదీన ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నాసా, యూరప్, కెనడా దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అతిపెద్ద టెలిస్కొప్ జేమ్స్ వెబ్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వివిధ కక్ష్యలను దాటుకొని సుమారు 15 లక్షల కిమీ దూరం ప్రయాణించి రెండో లాంగ్రెంజ్ పాయింట్‌ను చేరుకుంది. అక్కడి నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం నుంచి వివిధ సమాచారాన్ని సేకరించి భూమికి పంపనున్నది. Read: What’s…