Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి.
Massive 'Hole' Spotted on Sun's Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్…
Supermassive Black Hole: ఈ అనంత విశ్వంలో ఇప్పటి వరకు అంతుబట్టని విషయాల్లో బ్లాక్ హోల్ ఒకటి. మన శాస్త్రవేత్తలు విశ్వం గురించి తెలుసుకున్నది కేవలం కొంతమాత్రమే. ఇప్పటికే అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ బ్రహ్మాండం తనలో దాచుకుంది. బ్లాక్ హోల్స్ ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. నక్షత్రాల కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దదిగా ఉంటూ.. సమీపంలోని నక్షత్రాలను, గ్రహాలను తనలో కలిపేసుకుంటూ అంతకంతకు పెద్దదిగా మారుతుంది. చివరకు సెకన్ కు 3…
NASA: సౌరకుటుంబంలో అనేక గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. చాలా వరకు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం వీటి నుంచి బయటపడి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. అయితే తాజాగా కనుగొన్న గ్రహశకలం మాత్రం విచిత్రమైన ఆకారంలో ఉంది. ఓ పెద్ద భవనం మాదిరిగా ఉంది. దీని పొడవు 1600 అడుగులు కాగా.. వెడల్పు 500 అడుగులు ఉన్నట్లు,…
Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
End Of The Earth: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, మరణం అనేది ఉంటుంది. ఏదో రోజు మన సౌరవ్యవస్థకు మూలం అయిన సూర్యుడు కూడా చనిపోతాడు. అయితే దీనికి కొన్ని బిలియన్ ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఆ సమయంతో భూమి కూడా అంతం అవుతుంది. అయితే చివరి రోజుల్లో భూమి అంతం ఎంతటి దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. అయితే అందుకు ఓ ఉదాహరణ లభించింది.
How And When Will The Sun Die?: సౌరకుటుంబానికి ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, కాంతితోనే ఈ సమస్య సౌరకుటుంబం నిలబడి ఉంటోంది. ముఖ్యంగా భూమిలాంటి గ్రహానికి సూర్యుడు నుంచి వచ్చే శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలతో చూస్తే ఒక్క భూమిపై మాత్రమే జీవజాలం ఉంది. సమస్త జీవజాలం బతకాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి అత్యవసరం. కిరణజన్య సంయోగక్రియ, భూమిని వెచ్చగా ఉంచడానికి సూర్యడు సహాయకారిగా ఉన్నారు. భూమిపై…
Black Hole : సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్ను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి దగ్గరగా వచ్చినట్లు వారు తెలిపారు. మొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ ను పాలపుంతలో గుర్తించినట్లు సైంటిస్టులు వెల్లడించారు.
Sound Of Earth's Magnetic Field Released By European Space Agency: భూమిపై ఉన్న సమస్త జీవజాలాన్ని భూ అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ పార్టికల్స్, సూర్యుడి నుంచి వెలువడే సౌరజ్వాలలు, సోలార్ తుఫానుల నుంచి భూమిని రక్షిస్తోంది. అయితే ఇంతలా భూమిని రక్షిస్తున్న ఎర్త్ మాగ్నెటిక్ ఫీల్డ్ సౌండ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..? తాజా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన సౌండ్స్ రికార్డ్ చేసింది. భూమి…
Partial Solar Eclipse: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. యూరప్, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో ఈ ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. 25 మధ్యాహ్నం ఇండియాలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో తూర్పు ప్రాంత నగరమైన కోల్‌కతా ప్రజలు తక్కువ సమయం పాటు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు…