సూర్యడిపై భారీ విస్పోటనం జరిగింది. దీంతో భారీ సౌరజ్వాల భూమి వైపు వస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సౌరజ్వాల భూమిని తాకితే భూమిపై కమ్యూనికేషన్, జీపీఎస్, రేడియో సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రేడియో బ్లాక్ అవుట్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.
సూర్యుడు ప్రస్తుత తన 11 సంవత్సరాల సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి వాతావరణం క్రియాశీలకంగా మారింది.సూర్యుడిపై భారీగా సౌర జ్వాలలు ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సౌర జ్వాలలు ఏర్పడే అవకాశం ఉంది. సూర్యుడి లోని కొత్త ప్రాంతం ఏఆర్3058 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ ఓషియానికి అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్( ఎన్ఓఏఏ) వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడిన సౌరజ్వాల ఎక్స్ తరగతికి చెందినదిగా గుర్తించారు.
Read Also: CM KCR: నేడు టీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం
సూర్యుడి ఉపరితలంపై బలమైన విద్యుదయస్కాంత విస్పోటనాలు చోటు చేసుకుంటాయి. విస్పోటనం శక్తిని బట్టి సౌరజ్వాలలను ఏ, బీ, సీ, ఎం, ఎక్స్ తరగతులుగా వర్గీకరిస్తారు. ఇందులో ఎక్స్ తరగతి సౌరజ్వాలలు అత్యంత శక్తివంతమైనవి. భూమికి చుట్టూ ఉంటే బలమైన విద్యుదయాస్కాంత క్షేత్రం ప్రమాదకరమైన సౌరజ్వాలలను అడ్డుకుంటుంది. ఈ చర్యలో అధిక శక్తి విడుదలై భూమి వాతావరణంలోని పై పొరలను ఆయనీకరనం చేస్తుంది. ఈ సౌరజ్వాలలు కొన్ని వేల బిలియన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే భారీ శక్తి కారణంగా భూమి ఐనోస్పియర్ లో తాత్కాలికంగా ఇబ్బందులు కలుగచేస్తుంది. సౌరజ్వాల నుంచి వచ్చే మంట వల్ల భూమి అవుటర్ అట్మాస్పియర్ వేడెక్కి వ్యాకోచిస్తుంది. దీంతో సిగ్నల్స్ కు, రేడియో కమ్యూనికేషన్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భూమిపై విద్యుత్ గ్రిడ్ లు కుప్పకూలే ప్రమాదం ఉంది.