భూమిపై జీవం ఆవిర్భవించి ఎన్ని కోట్ల సవంత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవంలో మార్పులు జరుగుతూనే ఉన్నది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకు ఎన్నో మార్పులు జరిగాయి. అయితే, జీవం పుట్టుకకు ప్రధాన కారణం ఏంటి అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. భూమి పుట్టుకకు సూపర్ మౌంటైన్స్ కారణమని తేల్చారు. ఈ సూపర్ మౌంటెయిన్స్ భూమిపై రెండుసార్లు ఉద్భవించాయని గుర్తించారు. రెండు వేల నుంచి 1800 మిలియన్ సంవత్సరాల క్రితం ఒకసారి సూపర్ మౌంటైన్స్ ఏర్పడగా, 650 నుంచి 500 మిలియన్ సంవత్సరాల క్రితం రెండోసారి ఈ సూపర్ మౌంటైన్స్ ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read: ఉక్రెయిన్ లో శాంతి కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు… చర్చలు ఫలిస్తాయా?
భూమిపై ఉన్న పురాతన పర్వతాలైన హిమాలయాలు కంటే ఈ సూపర్ మౌంటైన్ పర్వతాలు పురాతనమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటిసారి ఏర్పడిన సూపర్ మౌంటైన్స్ నుంచి మంచు కరిగి నీరులా మారిందని ఆ నీటి నుంచే తొలి జీవం ఉద్భవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. లుటిటియం తో కూడిన తక్కువ జిర్కాన్ జాడలను గుర్తించారు. భూమి ఆవిర్భవించిన తొలినాళ్లలో ఆక్సిజన్ కూడా లేదని, ఆ తరువాత జరిగిన పరిణామాల తరువాత భూమిపై కొద్దిమొత్తంలో ఆక్సీజన్ ఏర్పడిందని, అనంతరం జీవులు ఉద్భవించిన తరువాత ఆక్సీజన్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల అంశాలను ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.