మనం నివశించే భూమిపై మూడు వంతులు సముద్రం ఉండగా ఒక భాగం మాత్రమే మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇతర అవసరాలు తీరుతున్నప్పటికీ, నేల పెరగడం లేదు. దీంతో భూమికి విలువ భారీగా పెరిగిపోయింది. గజం స్థలం విలువ వేల రూపాయల్లో ఉంది. అయితే, భూమి మోత్తం విలువ ఎంత ఉంటుంది అనే దానిపై ఆస్ట్రోఫిజిసిస్ట్ గ్రెగ్‌లాగ్‌లిన్ అనే వ్యక్తి ఎస్టిమేషన్ వేశారు. వయసు, స్థితి, ఖనిజాలు, మూలకాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని లెక్కకట్టారు. ఈ లెక్కల ప్రకారం భూమి మొత్తం విలువ సుమారు 3,76,358 ట్రిలియన్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం మార్స్ విలువ 12 లక్షల రెండువేలు కాగా, శుక్రగ్రహం విలువ కేవలం 70 పైసలు మాత్రమే ఉంటుందట. ఈ విశ్వం అన్నింటిలోకి భూమి అత్యంత విలువైన గ్రహాం కాగా, శుక్రగ్రహం అత్యంత చౌకైన గ్రహమని చెప్పుకోవచ్చు.
Read: 16 సెకన్లు మాస్క్ తీసినందుకు రూ. 2 లక్షలు ఫైన్.. ఎక్కడంటే..?