గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట…
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును గతనెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు… అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియడంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఎస్కార్ట్ కల్పించలేమని జడ్జికి విన్నవించారు పోలీసులు… దాంతో అనంతబాబును ఆన్‌లైన్‌లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… అయితే, జులై 1వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ ను పొడిగించారు……
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…
మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగిసింది. అయితే రిమాండ్ ముగియక ముందే ఆన్‌లైన్‌లో విచారణకి హాజరవుతానని మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు ఎమ్మెల్సీ. ప్రజాప్రతినిధి కావడంతో భద్రతను కారణంగా చూపారు. కేసు తీవ్రత దృష్ట్యా మెజిస్ట్రేట్ ఎమ్మెల్సీ అభ్యర్థనను తిరస్కరించారు. ఇంకేముందీ అనంతబాబు కోర్టుకి హాజరవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎస్సీ…
ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. ఏపీలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో ఎమ్మెల్సీ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు డ్రైవర్ కుటుంబ సభ్యులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యు లు, దళిత సంఘాల ఆందోళనలతో మూడు రోజులకు.. నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 23న అనంత బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ విషయంలోనూ పెద్ద సస్పెన్స్ ధ్రిల్లర్ క్రియేట్ చేశారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అంతా ఎమ్మెల్సీకి అనుకూలంగా…