Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Did That Mla Spin The Wheel In The Mp Case

YCP : ప్రజాప్రతినిధి కేసులో ఆ ఎమ్మెల్యే చక్రం తిప్పాలని చూశారా.? అభిమానంతో అడ్వాన్స్ అయ్యారా.?

Published Date - 11:07 AM, Tue - 21 June 22
By Sista Madhuri
YCP : ప్రజాప్రతినిధి కేసులో ఆ ఎమ్మెల్యే చక్రం తిప్పాలని చూశారా.? అభిమానంతో అడ్వాన్స్ అయ్యారా.?

గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట.

చంటిబాబు జగ్గంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగ్గంపేట టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న చంటిబాబును వైసీపీలోకి తీసుకురావడంలో అనంతబాబు ఫుల్‌ సపోర్ట్‌ చేశారట. తర్వాత జరిగిన ఎన్నికల్లో చంటిబాబుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం.. ఆయన ఎమ్మెల్యే కావడం చకచకా జరిగిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఉంది. చంటిబాబు.. నెహ్రూ.. అనంతబాబు ముగ్గురూ బంధువులే. నాడు రాజకీయంగా సపోర్ట్ చేయడం.. బంధువు కావడంతో అనంతబాబు కేసులో ఇరుక్కున్నప్పుడు చంటిబాబు యాక్టివ్‌ రోల్‌ పోషించినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అదేదో చిన్న కేసు అనుకుని తనస్థాయిలో చక్కబెట్టేద్దామని ఎమ్మెల్యే అభిప్రాయపడినట్టు టాక్‌. కానీ.. చివరకు చిరిగి చేట అవ్వడంతో కక్కలేక మింగలేక ఉన్నారట చంటిబాబు.

కేసులో నుంచి ఎలా బయటకు రావొచ్చు.. అనపర్తి స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తున్న ఒక అధికారిని మధ్యలో ఉంచి మొత్తం క్లియర్‌ చేస్తానని అనంతబాబుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగా జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి పిక్చర్‌ ప్రిపేర్‌ చేశారట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లడంతో.. అనవసర విషయాల్లో తలదూర్చొద్దని ఎమ్మెల్యేకు ఆదేశాలు వెళ్లాయట. దాంతో ఆ హెల్పింగ్‌ ఎపిసోడ్‌కు అక్కడితో బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు పిన్‌ టు పిన్‌ అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. అందుకే అప్పట్లో జరిపిన ఫోన్‌ సంభాషణపై ఎమ్మెల్యే ఇప్పుడు బెంగ పెట్టుకున్నారట.

హత్య కేసుతో సంబంధం లేకపోయినా.. ఆ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్లే చేయకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడుతున్నారట ఎమ్మెల్యే. మరీ అడ్వాన్స్‌ అయిపోయామా అని ఆంతరంగికుల చర్చల్లో ఆరా తీస్తున్నారట. పరిధికి మించి ప్రవర్తించామా అని ఒక్కోసారి ఉలిక్కి పడుతున్నారట. భవిష్యత్‌లో విచారణకు పిలవరు కాదా అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అసలే అక్షింతలు పడ్డాయి. ఇప్పుడు పిలిస్తే ఇంకా డ్యామేజ్‌ అవుతుందని టెన్షన్‌ పడుతున్నారట ఎమ్మెల్యే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని.. దారినపోయే కంపను తగిలించుకున్నామని ఆవేదన చెందుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జిల్లా వైసీపీ వర్గాల్లో ఏమ్మా చంటి..! ఏంటి సంగతి అని సెటర్లూ వేస్తున్నారట.

 

 

  • Tags
  • ananthababu
  • driver Subramaniam
  • Jaggampeta
  • MLA Jyothula Chanti Babu
  • tdp

RELATED ARTICLES

P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!

TDP: అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్‌ ప్రకటన హల్‌చల్.. టీడీపీ క్లారిటీ

Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

BJP National Executive Meeting: ఎన్టీఆర్‌ రియల్‌ హీరో, ఆయన దేవుడు..!

Chandrababu: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ఫైర్‌

తాజావార్తలు

  • BJP National Executive Meeting: వాన‌ టెన్ష‌న్‌.. ఆందోళ‌న‌లో క‌మ‌లం

  • Hyderabad: బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు

  • Srilanka: కీలక నిర్ణయం.. భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల వీసా

  • Yadadri : రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

  • LIVE UPDATES: హైదరాబాద్‌లో కాషాయ సంబరాలు

ట్రెండింగ్‌

  • Interesting Facts: ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని ఎందుకు దూరంగా ఉంచుతారు?

  • Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions