మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును గతనెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు… అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ ముగియడంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ఎస్కార్ట్ కల్పించలేమని జడ్జికి విన్నవించారు పోలీసులు… దాంతో అనంతబాబును ఆన్‌లైన్‌లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… అయితే, జులై 1వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ ను పొడిగించారు… ఇప్పటికే ఆనందబాబు బెయిల్ కోసం చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు… కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్‌ని తిరస్కరించింది మెజిస్ట్రేట్.
Read Also: Presidential Election: విపక్షాలకు షాక్.. ఆయన కూడా చేతులెత్తేశారు..
మరోవైపు, అనంత బాబు నుంచి మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు… కస్టడీ పిటిషన్ లో సమగ్ర వివరాలు లేవని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి కస్టడీ పిటిషన్ ను రిజక్ట్ చేశారు.. జులై 1 వరకు అనం బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు… పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను మెజిస్ట్రేట్ తిరస్కరించినప్పటికి మరొకసారి కస్టడీ పిటిషన్ వేయలేదు… అనంత బాబు మాత్రం బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు… పౌరహక్కుల సంఘం నేతలు జిల్లా పోలీసులపై నమ్మకం లేదని సుబ్రహ్మణ్యం కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కోరుతున్నారు.. దానిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సైతం అనంత బాబుకు బెయిల్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చెబుతున్నారు.. విచారణ జరిపి అనంత బాబుకు శిక్షపడేలా చేయాలని కోరుతున్నారు. మొత్తానికి మెజిస్ట్రేట్ అనంత బాబు రిమాండ్ పొడిగించారు… మరొక 11 రోజుల పాటు ఆయన జైలులోనే ఉండనున్నారు.