దేశంలోనే ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఖైరతాబాద్ ఇందిరా నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు కేటీఆర్,తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో పేద ప్రజలు ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేసీఆర్ ఇస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ఒక్క హైద్రాబాద్ లోనే 9714 కోట్లు రూపాయలతో ఇళ్ళు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం లో కట్టిన ఇళ్ళు డబ్బా…
రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లి లో వడ్డెర బస్తీలో కూల్చిన ఇళ్ళను పరిశీలించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, దివంగత పి.జనార్థన్ రెడ్డిని తలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవల్ని స్మరించారు ఆయనే వుండి వుంటే.. పేదల ఇళ్ళను కూల్చే ధైర్యం ఎవరికైనా వుండేదా అని అన్నారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు రేవంత్…