తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నిజామాబాద్ జిల్లా బీజేపీ రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ధర్నాలో పాల్గొన వద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పినా రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరుకావటం చూస్తే మంత్రి ప్రశాంత్ పని అయిపోనట్లే అనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని కేసీఆర్ కి నిజంగా మనసులో ఉంటే తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలన్నారు రఘునందన్ రావు.
Read Also:Karthikeya -2: మీ క్లిక్స్ కోసం నన్ను బలిపశువుని చేయొద్దు: ‘దిల్’ రాజు
ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతు ధర్నాకు వస్తున్న నన్ను అడ్డుకునే యత్నం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.. 2014 లో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని, చెరుకు, పసుపు పరిశోధన కేంద్రం తెరిపిస్తానని చెప్పి మాట తప్పారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంది. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్రంలో నత్తనడకన డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణాలు సాగుతున్నాయి.
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారు. ప్రతిపక్ష పార్టీల నేతలని, అభివృద్ధి కోసం నిలదీసే వారిని నిలువరించేందుకు చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు రఘునందన్ రావు. స్పైస్ బోర్డుకు, పసుపు బోర్డుకు తేడా ఎంటో తెలియని మంత్రి ప్రశాంత్ రెడ్డి అని రఘునందన్ ఎద్దేవా చేశారు. తాళ్ళ రాంపూర్ సొసైటీలో అక్రమాలు మంత్రి ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని రఘునందన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.