దేశంలోనే ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఖైరతాబాద్ ఇందిరా నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు కేటీఆర్,తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో పేద ప్రజలు ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేసీఆర్ ఇస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్.
భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ఒక్క హైద్రాబాద్ లోనే 9714 కోట్లు రూపాయలతో ఇళ్ళు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం లో కట్టిన ఇళ్ళు డబ్బా మాదిరిగా ఉండేవని, కానీ ఈసారి ఎంతో సౌకర్యవంతంగా, నాణ్యంగా వుండే ఇళ్ళు తెలంగాణలో నిర్మించి పేదలకు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఆసియా ఖండంలోనే అతి పెద్ద హౌసింగ్ కాలనీ 112 బ్లాక్ లతో కొల్లూరు లో నిర్మిస్తున్నామని.. సీఎం కేసీఆర్ త్వరలోనే దానిని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పోరేటర్లు, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.