Home
Donald Trump
Donald Trump News
-
UN on Ukraine: రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్, భారత్ గైర్హాజరు.. యూఎన్‌లో సంచలనం..
UN on Ukraine: అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతీ దశలో కూడా ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచింది, అందుకు తగ్గట్లుగానే ఓటింగ్‌లో పాల్గొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు. -
Donald Trump: ఉక్రెయిన్ ‘‘అరుదైన లోహాల’’పై ట్రంప్ కన్ను.. అమెరికాకి పుతిన్ ఆఫర్..
Donald Trump: అమెరికా, ఉక్రెయిన్‌లోని ‘‘అరుదైన లోహాల’’పై కన్నేసింది. ఉక్రెయిన్ సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో అమెరికాకు వాటా మంజూరు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్ స్కీ ఈ ప్రతిపాదనపై సంతకం చేయడానికి ఈ వారం లేదా వచ్చే వారు వైట్ హౌజ్‌కి రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలకు కేంద్రంగా మారింది. సోమవారం వైట్‌హౌజ్‌లో… -
German Election: జర్మనీ తదుపరి ఛాన్సలర్‌గా ఫ్రెడరిక్ మెర్జ్.. ‘‘గొప్ప రోజు’’ అంటూ ట్రంప్ ప్రశంసలు..
German Election: జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతోంది. తదుపరి జర్మనీ ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్ కూటమి విజయం దిశగా వెళ్తోందని ఆదివారం అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మరోవైపు ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన ఓటమిని అంగీకరించారు. తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. -
Donald Trump: హసీనాను దించేందుకు అమెరికా నిధులు.? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. -
Giorgia Meloni: నేను, మోడీ, ట్రంప్ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా.? వామపక్షాలపై మెలోనీ తీవ్ర ఆగ్రహం..
Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. -
Donald Trump: ఉక్రెయిన్ శాంతి చర్చల్లో జెలెన్ స్కీ అంత ముఖ్యం కాదు..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జెలెన్ స్కీని నియంతగా పోల్చుతూ, ఉక్రెయిన్‌ని నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Justin Trudeau: అమెరికాని ఓడించిన కెనడా.. ట్రంప్‌కి ట్రూడో స్ట్రాంగ్ రిఫ్లై..
Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడాని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని టార్గెట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రం కలపాలంటూ, ట్రూడో గవర్నర్ గా ఉండాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా ఫోర్ నేషన్స్ ఫేస్-ఆఫ్ ఫైనల్లో కెనడా, అమెరికా ఐస్ హాకీలో తలపడ్డాయి. ఈ పోటీలో అమెరికాను కెనడా ఓడించింది. -
USAID Row: భారత్‌కి అమెరికా నిధులపై వాషింగ్టన్ పోస్ట్ కథనం.. బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ ఎటాక్..
USAID Row: అమెరికాలోని గత బైడెన్ ప్రభుత్వం భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. USAID ద్వారా 21 మిలియన్ డాలర్ల నిధులను భారత్‌లో ‘‘ఓటర్ల ఓటు’’ కోసం కేటాయించారని ట్రంప్ ఆరోపించారు. 2024 భారత లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నడుమ అధికార బీజేపీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. -
Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు. -
Trump vs INDIA: భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం సరైంది కాదు అని పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
-
Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
-
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!