అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. పుతిన్ అమెరికన్లతో స్నేహం కొనసాగించకూడదు.. ఎందుకంటే, అతను అమెరికాతో స్నేహంగా ఉండే వ్యక్తి కాదు.. అస్సలు పుతిన్ మా స్నేహితుడు కాదని అమెరికన్ ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్లాదిమిర్ పుతిన్ మంచి వ్యక్తి కాదు అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.
Read Also: BJP Vijaya Sankalpa Yatra: నేడే బీజేపీ సమరశంఖం.. ప్రచారరథాలు ప్రారంభించనున్న కిషన్ రెడ్డి
అయితే, దక్షిణ కరోలినాలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గురించి నిక్కీ హేలీ రియాక్ట్ అయింది. అమెరికా మిత్రదేశాలు వారి రక్షణ వ్యయ లక్ష్యాలను చేరుకోకపోతే.. పుతిన్ తన ప్రత్యర్థులను చంపేసే రకం అని ఆమె ఆరోపించారు. ఇప్పటికే రష్యాలో తన రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయడంలో రష్యా నాయకుడి పాత్ర స్పష్టం అవుతుంది అని నిక్కీ హేలీ పేర్కొనింది. కాగా, నిక్కీ హేలీ సౌత్ కరోలినా యొక్క మొదటి మహిళా మాజీ గవర్నర్, ఆమె రాబోయే ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్‌లపై అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడుతున్నారు. గత కొన్ని వారాలుగా ఆమె పుతిన్‌తో ట్రంప్ పొత్తును విమర్శిస్తున్నారు.