S Jaishankar: నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి.
మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. కెనడాను తమ దేశంలో 51వ ప్రావిన్స్‌గా మార్చాలని సరదాగా మాట్లాడారు. అయితే నేడు కెనడా ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. భారీ పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ చేసిన ఈ జోక్‌ను రియాలిటీగా మార్చడం గురించి కెనడాలో చాలా మంది చర్చించుకుంటున్నారు.
Indian American: యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన కార్యవర్గంలో ఇండో- అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు ఆయన కీలక బాధ్యతలు ఇచ్చారు.
‘అధ్యక్షుడు మస్క్’ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ యూఎస్ అధ్యక్షుడు కాలేరని చెప్తున్నాను.. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదని పేర్కొన్నారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మన చమురు, గ్యాస్‌ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అమెరికా వారితో విపరీతమైన లోటును భర్తీ చేయాలని యూరోపయిన్ యూనియన్‌కి చెప్పాను. లేకపోతే అన్ని విధాలుగా టారిఫ్‌లు ఉంటాయి’’ అని హెచ్చరించారు.
Govt Shutdown: షట్‌డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది.
Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్సింగ్ గట్టి షాకిచ్చారు. ట్రూడో లిబరల్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు.
US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది.
Shutdown Threat: అధికార మార్పిడికి రెడీ అవుతున్న సమయంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడింది. క్రిస్మస్ పండగ సమయంలో షట్‌డౌన్ ముప్పును తప్పించేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ తిరస్కరించారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.