Donald Trump: లక్షల మంది భారతీయులకు ట్రంప్ గుడ్‌న్యూస్.. ఆ వీసాదారులకు నో టెన్షన్
- హెచ్-1బీ వీసాదారుకు తీపికబురు
- ఈ వీసాలపై నిషేధం ఉండదని ట్రంప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. “నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం.” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో ఈ హై స్కిల్ వీసా పొందుతున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 2024లో జారీ చేసిన మొత్తం 2 లక్షల 80 వేల హెచ్-1బీలో భారతీయులు దాదాపు 2 లక్షల వీసాలు పొందారు.
READ MORE: IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వీసాలపై వివాదం చెలరేగింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని వ్యాఖ్యానించారు.
READ MORE: Akhanda2 – Thaandavam: బాలయ్య కోసం గోల్డెన్ లెగ్.. తప్పించి తెచ్చారా, తప్పుకుంటే తెచ్చారా?
హెచ్-1బీ వీసా అంటే ఏంటి?
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు. జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్-1990 అమల్లోకి వచ్చింది.
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!