అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రంప్ గతంలో కంటే చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫ్లోరిడాలోని ట్రంప్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ 'ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్' నుంచి వచ్చింది. ఆయనను మద్దతుదారులు సాదర స్వాగతం పలికారు. ట్రంప్ హృదయపూర్వకంగా ప్రతిస్పందించడం వీడియోలో కనిపిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. కాగా.. తాజాగా…
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించాడు.
Trump - Trudeau: వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలర్ట్ అయ్యారు.
పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు రిలీఫ్ కల్పించాలని ట్రంప్ తాజాగా కోర్టును కోరారు. కానీ, ఆయన చేసిన ఈ విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనవరి 20,2025న ఆయన అధ్యక్ష బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. అయితే, ఆయన పదవి చేపట్టే ముందే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిహద్దు గోడకు సంబంధించిన సామాగ్రిని విక్రయిస్తున్నట్లు తెలిసింది.
Donald Trump: వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. జనవరి 20, 2025లో అధికారం చేపట్టిన వెంటనే వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ‘‘డిపోర్టేషన్’’ చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ఆయన మరి కొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక, ఈ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు సమాచారం.
Donald Trump: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈక్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి స్పీడ్ గా పర్మిషన్స్ మంజూరు చేయడంతో పాటు పర్యావరణ అనుమతులను కూడా వెంటనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.
బైడెన్ మాట్లాడుతూ.. 2020లో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్టింగ్ లో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్‌పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరును సంపాదించుకున్నాడని ఆయన తెలిపారు. కానీ, ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన.. ట్రంప్ లాగా నేను చేయలేకపోయానని చెప్పుకొచ్చారుు. తానో ‘స్టుపిడ్’ అని అంటూ అతడు విచారం వ్యక్తం చేశారు.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాత్రమే భయపడతారని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ లతో ఇటీవల భేటీ అయిన విషయం గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.