అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, డీఐఐటీ ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, సుంకాల ప్రభావాలను పిఎంఓకు వివరించారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ట్రంప్ సుంకాలపై ఉన్నతస్థాయిలో అంచనాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. Read Also: Amazon…
Trump's Tariff: డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
అగ్ర రాజ్యం అమెరికాలో ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పని చేసే అవకాశం ఉంటుంది. మూడోసారి చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం.. ఏ వ్యక్తి కూడా రెండుసార్లు కంటే ఎక్కువ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25% సుంకాన్ని సమర్థవంతంగా విధిస్తుందని ట్రంప్ అన్నారు. యూఎస్‌లో తయారైన కార్లకు ఎటువంటి సుంకం ఉండదని ఆయన అన్నారు. ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. దాని పునరుద్ధరణ ఏప్రిల్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
Tariff cuts: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో భయపెడుతున్నారు. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై టారిఫ్స్ విధించాడు. ఇండియా కూడా తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు తమతమ ఉత్పత్తులపై సుంకాల విధింపును పరిశీలిస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలు తగ్గించడానికి భారత్…
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు.
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు.