US-Ukraine Peace Talks: వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్ స్కీల మధ్య వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంమైంది. అయితే, ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చల్ని ప్రారంభించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఇరు దేశాల నేతలు కూడా జెడ్డా వేదికగా చర్చించనున్నారు.
Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.
Donald Trump: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో వైట్ హౌజ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు, సుంకాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. Read Also: Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనికి లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు గురువారం ఇరాన్ నాయకత్వానికి లేఖ పంపారు. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Justin Trudeau: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన చివరి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 9 ఏళ్ల పదవీకాలంలో గందరగోళ క్షణాలను, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన భారీ సుంకాలను చర్చిస్తూ కంట తడి పెట్టారు. ప్రజాదరణ రేటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో ట్రూడో జనవరిలో తాను ప్రధాని పదవికి, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్లకు మొదటి ప్రాధాన్యం ఉండాలనే తన నిబద్ధతను చెప్పారు.
Indians In US: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయులను కూడా బహిష్కరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికాలోని వేలాది మంది భారతీయులు H-4 వీసా కింద మైనర్లుగా వలస వెళ్లారు.
Ukraine: అమెరికా, ఉక్రెయిన్ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. "మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది..…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే అంతు చూస్తానంటూ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
America-China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనా దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. కానీ, ఇప్పుడు ఆ సుంకాలను 20 శాతం చేసిన తర్వాత చైనా ప్రతిస్పందించింది. Read Also: Graduate MLC Elections: పట్టభద్రుల…