Elon Musk: అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ వాదనకు 80% మద్దతు..!
- అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమన్న మస్క్
- రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని పోల్
- తాజాగా ఈ పోల్ ఫలితాలను వెల్లడించిన మస్క్
- 80% మంది ప్రజలు మద్దతుగా ఓటు వేశారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను మస్క్ వెల్లడించారు. 80% మంది ప్రజలు మద్దతుగా ఓటు వేశారని ట్రంప్ పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: జలవనరుల శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
“అమెరికాలో 80% మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం! సరిగ్గా 80% మంది దీనితో ఏకీభవిస్తున్నారు.” అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ‘ది అమెరికా పార్టీ’ అని టైటిల్ పెట్టారు. సోషల్ మీడియాలో మస్క్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో మస్ ఈ చర్చ తీసుకురావడం సంచలనంగా మారింది.
READ MORE: CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!
మరోవైపు..శత్రువును డొనాల్డ్ ట్రంప్ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. తన దారికి రాని వారిపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగించడానికీ వెనుకాడరు. తన ఆదేశాలను పాటించని అమెరికా విశ్వవిద్యాలయాలపై ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. సుంకాల విషయంలోనూ రాజీపడటం లేదు ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారని భావించలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ట్రంప్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. అంతటితో ఆగలేదు. తాను సాయం చేయకపోతే అమెరికా పీఠంపై ట్రంప్ కూర్చునేవారే కాదని పేర్కొన్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్న సంకేతాలనూ పంపారు. ట్రంప్‌పై అభిశంసనను తాను సమర్థిస్తానని వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో మస్క్ దాడి చేసిన తర్వాత ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!