2022 నిరసనకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇద్దరి నేతలకు బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ శివారులో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ‘‘జన ఆందోళన్ సభ’’ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
Congress : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు.
కర్ణాటకలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెడుతోన్న బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం పలు ఆరోపణలు చేశారు. అవినీతిలో బీజేపీయే అగ్రగామి అని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పుడు వారు చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రె
DK Shivakumar: కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్ లో చోటు చేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు.
పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం దాన్ని తొలగించారు.
DK Shiva kumar : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి క్రమశిక్షణ చాలా కీలకమని.. క్రమశిక్షణ లేకుంటే ఏమీ ఉండదని తెలిపారు.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.