2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టును కొనసాగించడానికి భయపడ్డాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వంలో దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే కీలకంగా మారాయి. అయితే.. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగా సీఎం సిద్ధరామయ్య మెనిఫెస్టోలో.. breaking news, latest news, telugu news, karnataka anna bhagya scheme, Siddaramaiah, dk shivakumar
కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గెలిచిన ఎమ్మె్ల్యేలు 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.