రేపు తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే, ఎల్లుండి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సైతం టీకాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు.
D K Shivakumar: కర్ణాటక రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా, జనతాదళ్ సెక్యులర్(జడీఎస్) ప్రభావం దారుణంగా పడిపోయింది. దీంతో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.