తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి చేరుకున్న ఆయన హనుమకొండ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలో జరిగని సభలో ఆయన ప్రసంగించారు. సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని పేర్కొన్నారు.…
DK Shivakumar: కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసును రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. గతంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా రెండు రోజుల పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇందుకోస ఆయన రేపు ఉదయం బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరు చేరుకొనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి…
Gruha Lakshmi scheme: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు ఆ పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందులో ఒక పథకమే ‘గృహలక్ష్మీ’. ఈ పథకం ద్వారా ఏపీఎల్/బీపీఎల్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబ మహిళకు రూ.2000 అందిస్తున్నారు. అయితే ఈ పథకం కింద చాముండేశ్వరి అమ్మవారికి ప్రతీ నెల రూ. 2 వేలు చెల్లించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఉపాధ్యక్షుడు దినేష్ గూలిగౌడ శుక్రవారం…
HD Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాగ్ధానాలు చేస్తున్నారని సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత…
వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ విజయభేరీ యాత్ర జరిగింది. అంబేడ్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నాడని విమర్శించారు.