Congress Meeting: పార్టీ అధిష్ఠానానిదే ఆ బాధ్యత.. ముగిసిన సీఎల్పీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Meeting: కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలించారు. సీఎం ఎవరన్నది, డిప్యూటీ సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. సీఎల్పీ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారని డీకే శివకుమార్ వెల్లడించారు. అందరితో చర్చించి సీఎం పేర్లను సీల్డ్ కవర్లో హైకమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Read also: Congress IT Minister: తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు చర్చంతా ఆ పదవి గురించే!
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈరోజు అంటే ఈరోజు తుది నిర్ణయం ప్రకటిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్య్యేలు దానిని బలపరిచారు. రెండు మూడు గంటల్లోనే సీఎల్పీ నేత ఎవరనే దానిపై స్పష్టత రానుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరు సీఎం అయినా సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!