తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Migration to BJP: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయి. అన్ని పార్టీల అసంతృప్త నేతలు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నా యి.
పిచ్చోడి చేతిలో రాయి... అది కేటీఆర్ కే వర్తిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC లీకేజీ లో ఏ ఒక్క మంత్రి కూడా నోరు విప్పలేదని మండిపడ్డారు.