DK Aruna counter to KTR: పిచ్చోడి చేతిలో రాయి… అది కేటీఆర్ కే వర్తిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC లీకేజీ లో ఏ ఒక్క మంత్రి కూడా నోరు విప్పలేదని మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్న పత్రం వాట్సప్ లో బండి సంజయ్ కి చేరడం నేరమా ? అని ప్రశ్నించారు. బీజేపీని ప్రజల్లో ఎదుర్కొనే శక్తి లేక బట్ట కాల్చి మీద పడేస్తున్నారని అన్నారు. కేటీఆర్ భాషలో తండ్రిని మించిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయి… అది కేటీఆర్ కే వర్తిస్తుందని అన్నారు. పోలీసులు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానిని కూడా లెక్క చేయకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా, గౌరవాన్ని IAS, IPS లు పోగొట్టుకోవద్దని సూచించారు. TSPSC లీకేజీ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి అరెస్ట్ లు చేశారని అన్నారు.
Read also: Harish Rao: కంటి వెలుగు పథకం ఓట్ల కోసం పెట్టలేదు
IPS, IAS లు నిష్పక్షపాతంగా పనిచేయాలని అన్నారు. నియంత పోకడలను సమర్థించే అధికారులను చరిత్ర క్షమించదని మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం అంటూ దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా IAS, IPS లు ఉండాలని అన్నారు. కేసీఆర్ పాపం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటదని డీకే అరుణ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడో చెప్పాలి? అని ప్రశ్నించారు. మోగడ్ని గొట్టి మొగసాలకు ఎక్కినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కవిత ఈడీ కార్యాలయం ముందు ఫోన్ లు చూపించారని అన్నారు. దేశంలోని విపక్షాలను ఏకం చేసి నాయకత్వం వహించడానికి.. మిగతా పార్టీలకు డబ్బులు పంపిస్తా అని కేసీఆర్ చెప్పినట్లు మీడియాలో వస్తుందని అన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందో, ఫోన్ ల గురించి కవిత చెప్పాలని అన్నారు. కేసీఆర్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?