Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar Responds On Kharif Crop Price Hike: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. పంటలకు రెట్టింపు ధర అందించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే.. కేంద్ర కేబినెట్ అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. వరి క్వింటాల్‌కు రూ.143 పెంచడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1360 ఉంటే.. తాజాగా అది రూ. 2183కు చేరుకుందన్నారు. ఈ లెక్కన.. గతంతో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823 పెరిగిందన్నారు. అలాగే.. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 ధర పెంచడం సంతోషకరమైన విషయమని తెలిపారు. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 నిర్ణయించడం ఆనందదాయకమని చెప్పుకొచ్చారు.
K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ఇదే సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కనీస మద్దతు ధర పెంచిన ప్రధాని మోడీ ప్రభుత్వం.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుందని అన్నారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ.. ఇవాళ (07-06-23) కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందన్నారు. ఈసారి వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రైతాంగం తరఫున మోడీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Neha Sharma : బికినీలో బోల్డ్ ట్రీట్..కుర్రాళ్లు తట్టుకోగలరా..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!