తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది…
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం…
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని..…
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు.…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. రెండు రోజుల క్రితం కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువ ఆక్సిజన్ మంజూరు చేసిందన్న ఆయన నిన్న మాట మార్చడం ఆయన మతి భ్రమించిందా అన్న సందేహాలకు తావిస్తోంది. లేక సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో ఈటల రాజేందర్ కు పదవీ గండం ఉందని వస్తోన్న…
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఆరువేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు. కరోనా…