Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
దర్శన్ కి శుభవార్త. అవును, దర్శన్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించడానికి అంగీకారం తెలిపింది. బళ్లారి జైలులో దర్శన్ వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యాయవాది పరామర్శకు వచ్చినప్పుడు దర్శన్ విజిటర్ రూమ్‌కు వచ్చి తాను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. బళ్లారి జైలులో ఉన్న దర్శన్ వెన్నునొప్పితో రోజూ నరకం అనుభవిస్తున్నాడు. అయితే త్వరగా బెయిల్ వచ్చేలా దర్శన్ వెన్నుపోటు డ్రామా చేస్తున్నాడనే అనుమానాన్ని కూడా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
Bank Holidays: మరో మూడో రోజుల్లో అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలో అధిక పండుగలు ఉంటాయి. అంతేకాదు ఈ నెలలోనే దసరా పండుగ కూడా ఉంది. ఇక సెలవుల జాతర వచ్చినట్లే.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ స్కీం ప్రారంభిస్తామని వెల్లడించారు.. దీపావళికి వీలైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. అభివృద్ధి పనులను స్ట్రీమ్ లైన్ చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసాడు ఈ యంగ్ హీరో . గామీ బ్రేక్ ఈవెన్ సాధించగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలలో నిర్మాతలకు హాట్ ఫేవరేట్ విశ్వక్ సేన్ అనడంలో సందేహం లేదు. విశ్వక్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే పేరు ఉంది.…
ఈ దీపావళిని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చక్కగా ముస్తాబై, రంగురంగుల బట్టలు ధరించి ఇంటిముందు పటాకులను పేల్చి ఉంటారు. ఇంకేముంది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. దీపావళి రోజు అందరూ టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తే, ఓ మహిళ వెరైటీగా.. జడలో పువ్వులకు బదులుగా టపాకాయలు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Canada: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తాన్ పేరు చెబుతూ కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కెనడాలోని హిందూ మందిరాలపై దాడులు చేయడంతో పాటు హిందువులను బెదిరించడం కూడా గతంలో చూశాం. తాజాగా ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. దీపావళి వేడుకల్లోకి వచ్చి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు.