Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో…
అగ్ర రాజ్యం అమెరికాలో మరో కీలక ముందడుగు పడింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళి భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది.
BSNL Recharge: ఈ దీపావళికి, జియో, ఎయిర్టెల్, Vi వంటి పెద్ద టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ప్లాన్‌లను ప్రారంభించాయి. అయితే, ఈసారి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. జూలైలో జియో, ఎయిర్టెల్, Vi లు తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పుడు, చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున, బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది దీపావళి తర్వాత కూడా…
మృణాల్ సౌత్ సినిమాల్లో రచ్చ చేస్తోంది. ఆమె సినిమాల్లో పని చేయడానికి ముందు అనేక హిట్ టీవీ సీరియల్స్ లో కనిపించింది. చేసిన కొన్ని సినిమాలతోనే మృణాల్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా, నటి తన అభిమాని షేర్ చేసిన ఒక వీడియోకి తన నిరాశ వ్యక్తం చేసింది. దీంతో పాటు అతన్ని మందలించింది కూడా. అసలు విషయం ఏమిటంటే దీపావళి రోజున ఒక అభిమాని ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్…
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పారా మిలటరీ జవాన్లతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి కావ్యతో కలిసి పారామిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశసేవలో పనిచేస్తున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబసభ్యులకు దీపావళి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’. సుజీత్ – సందీప్ సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. స్పెషల్ ప్రీమియర్స్ నుండి ‘క’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేసాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు నేడు పండగ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసాడు…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ…
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.