Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
- దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరిక..
- పటాకుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోండి..
- ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి పొందాలి..
- అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad CP: దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న పటాకుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని పటాకుల వ్యాపారులకు సూచించారు. అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి పొందాలని తెలిపారు. ప్రైవేట్ స్థలంలో ఉంటే యజమాని నుంచి ఎన్‌ఓసీతో పాటు గతేడాది తీసుకున్న అనుమతి లేఖ తప్పని సరిగి ఉండాలన్నారు. ఏర్పాటు చేయబోయే షాపు బ్లూ ప్రింట్, తదితర రసీదులను నేరుగా సంబంధిత జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో దాఖలు చేయాలని సూచించారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేయకుండా టపాసుల షాపులు పెడితే వారిపై కఠిచర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.
Read also: Banjara Hills: పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..
Also Read
అంతేకాకుండా.. టాపాసులు కొనుగోలు చేసినవారు తగ్గు జాత్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి ముందు టపాసులు కాల్చేటపుడు పిల్లలను గమనించాలన్నారు. పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే బాణాసంచా కాల్చేలా పెద్దలు పర్యవేక్షించాలన్నారు. ఇంటి ముందు రోడ్డు, వీధుల్లో షూటింగ్ చేసేటప్పుడు వాహనాలు, పాదచారులను గమనించాలని తెలిపారు. ఇంటి వరండాలో బట్టలు, ఇతర వస్తువులు మిగిలి ఉంటే ముందుగా వాటిని తొలగించాలని అన్నారు. ఇంటి నుండి బట్టలు కూడా తీసివేయాలన్నారు. బాంబులు పేల్చేటప్పుడు ఇంటి ముందు బకెట్‌లో నీరు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కాటన్ వస్త్రాలు ధరించడం ఉత్తమం అన్నారు. టపాసులను మీ చేతులతో పట్టుకుని కాల్చవద్దన్నారు. ప్రమాదవశాత్తు పేలుడు గాయం కావచ్చు.. ఇంట్లో లేదా వాకిలిలో బాంబులు పేల్చవద్దన్నారు. వాటి నుంచి వెలువడుతున్న శబ్దం.. పొగ వినికిడి, శ్వాస సమస్యలను కలిగిస్తుందన్నారు. ఇంట్లో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని, బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు.
Jai Hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’..?
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!