ప్రధానమంత్రి మోడీ స్వాతంత్య్ర దినోత్సవం వేళ తీపికబురును అందించారు. ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి లభిస్తుందని అన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ(GST) భారం తగ్గిస్తున్నట్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీ నిపణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘మేము పన్ను వ్యవస్థను సరళీకృతం చేశాము. గత ఎనిమిది సంవత్సరాలలో, మేము GST లో భారీ సంస్కరణలు చేశాము. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాము. మేము తదుపరి తరం GST…
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.
ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులతో కంపెనీ వారు తీపి కబుర్లు వినిపించారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తామని ప్రకటించారు. సమ్మెలో జీతాలు అందని ఉద్యోగులకు.. రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిగెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.