TSRTC: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులతో కంపెనీ వారు తీపి కబుర్లు వినిపించారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తామని ప్రకటించారు. సమ్మెలో జీతాలు అందని ఉద్యోగులకు.. రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిగెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ ఈ విషయంలో మాత్రం పండుగ అడ్వాన్స్ కు రూ.20 కోట్లు, బకాయిలకు రూ.20 కోట్లు చెల్లిస్తామని బాజిరెడ్డి స్పష్టం చేశారు. అంతే కాదు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను కూడా చెల్లిస్తామని బాజిరెడ్డి ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు చెల్లిస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. అందుకోసం 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Read also: Kantara: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా ‘కాంతారా’.. అలా అనొద్దంటున్న దర్శకుడు
సీఎం కేసీఆర్ పరిశీలనలో పీఆర్సీ, యూనియన్ పునరుద్ధరణ అంశాలు ఉన్నాయని బాజిరెడ్డి తెలిపారు. అలాగే పదవీ విరమణ పొందిన కార్మికుల ఆర్జిత సెలవు వేతనాల కోసం రూ.20 కోట్లు చెల్లిస్తామన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి 1150 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని బాజిరెడ్డి తెలిపారు. కొత్త బస్సులు వచ్చే వరకు కార్మికులు ఓపిక పట్టాలని కోరారు. ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 15 కోట్లు. ఆర్టీసిలో పీఆర్సీ డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేకపోతున్నామని బాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని, త్వరలో.. అన్ని సమస్యలు పరిష్కరించి సంస్థ గాడిలో పడేలా చూస్తామన్నారు.
Rishi Sunak: యూకే పీఎం రేసులో రిషి సునక్.. 100 మంది ఎంపీల మద్దతు..