దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది.
చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.