ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్‌ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న…
అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు..
రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారం సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సమాచారం ఇచ్చాడు. సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని తెలిపాడు. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నట్టు పేర్కొన్నాడు. 8 వారాల సమయం కోరాడు. 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి తెలిపాడు. సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం…
వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్...'' అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు..
దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసు విచారణ ముగిసింది.. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసు అధికారులు.. సీఐ శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసుల టీమ్ ఆర్జీవీని విచారించింది..
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్ ఎపిసోడ్‌లో ఉదయం నుండి సస్పెన్స్ కొనసాగుగుతూనే ఉంది. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఏపీ పోలీసులు రామ్ గోపాల్ డెన్ ఎదుట వేచిచూస్తున్నారు. వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకు వెళ్లాలని పోలీసులు రెడీ గా ఉన్నారు. కానీ సెర్చ్ వారెంట్ లేకపోవడంతో ఉదయం నుంచి రామ్ గోపాల్ వర్మ డెన్ లోపలికి పోలీసులు వెళ్లలేదు. ఆర్జీవీ ఎక్కడున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.దింతో చేసేదేమి లేక జూబ్లీహిల్స్ రోడ్ నంబర్…