Ram Gopal Varma: గుంటూరులో సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం.. సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని.. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నానని.. 8 వారాల సమయం కావాలని.. ఆ 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి సమాచారం ఇచ్చారు ఆర్జీవీ.. తనకు నోటీసులు అందజేసిన.. సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు.. సీఐడీ చీఫ్ రవి శంకర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు వర్మ.. అయితే, సీఐడీ విచారణకు ఆర్జీవీ హాజరుకాలేకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరఫు న్యాయవాది నాని బాబు..
Read Also: BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!
అనారోగ్య కారణాలతో.. గుంటూరులో సీఐడీ విచారణకు వర్మ హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నాని బాబు.. సీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. నేడు గుంటూరులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వర్మ తరపు అడ్వకేట్.. సీఐడీ విచారణకు రావడానికి రామ్ గోపాల్ వర్మ కు 8 వారాల సమయం కావాలని కోరారు.. అనారోగ్య కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలే పోతున్నారని, వర్మ తరపు న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సామాజిక మధ్యమాలలో పెట్టిన పోస్టుల కారణంగా వర్మ మీద కేసు నమోదు అయిందని, ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు వర్మకి నోటీసులు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది అంటున్నారు. 8 వారాల సమయం కోరాం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటూన్నారు వర్మ తరుపున న్యాయవాది..
Read Also: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. రూ.87 వేలు దాటిన బంగారం ధర!
కాగా, ఈ మధ్యే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేవారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. దీంతో.. ఈ నెల 9వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే..