వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా పరిణామాలు ఆసక్తిరేకిస్తున్నాయి. ఓ సినిమా కోసం రాంగోపాల్ వర్మ వరంగల్ జిల్లాలో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చించారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన…