RGV Mobile Phone Seize: సంచలన దర్శకుడు రాంగోపాల వర్మ.. సోషల్ మీడియా పోస్టులతో వివాదాల్లో చిక్కుకున్నారు.. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన రాంగోపాల్ వర్మ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి కించపరిచారణ కేసులు పెట్టారు.. రాంగోపాల్ వర్మ పై నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యాంది.. అయితే ఫిబ్రవరి 7వ తేదీ ఒక సారి విచారణకి హాజరైన వర్మ.. మరో సారి నోటీసులు జారీ చేయడంతో విచారణకి హాజరయ్యారు రాంగోపాల్ వర్మ. అయితే, విచారణలో భాగంగా ఆర్జీవీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
Read Also: Wife and Husband : భార్య గురించి.. ఎప్పుడూ బయట చెప్పకూడని విషయాలు ఎంటో తెలుసా !
అయితే, గత విచారణ సమయంలో సెల్ ఫోన్ తీసుకురాలేదు రాంగోపాల్ వర్మ.. అయితే, ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్‌ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు..