దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే జాబితాలో చేరింది.
వరుసగా మూడవరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనంతో ముందుకు నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయింది. 52,693కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది. భారతి…
తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
పెట్రోల్ ధరల తగ్గింపు అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించామని చెబుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంకెల లెక్కల గారడీ చేస్తున్నారని… కేంద్ర ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గత 60 రోజుల్లో కేంద్రం పెట్రోల్ ధరలను రూ. 10కి పెంచిందని… కేవలం ఇప్పుడు రూ.9.5 తగ్గించిందని, కనీసం పెంచినంత కూడా తగ్గించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా…
గత కొద్దిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 ధర పెంచింది. ఈ ధరలు నిన్నటినుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరింది. ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై ధరలు పెంచడం ఇది రెండోసారి. మార్చి…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిపిందు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు కాస్త కిందకు దిగొచ్చాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా ముగియకున్నా.. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ముడి చమురు దరలు మాత్రం తగ్గడం విశేషం. చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో బ్యారెల్‌పై 3.12 శాతం మేర ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 99.67 డాలర్లుగా ఉంది.…
కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి. https://ntvtelugu.com/viman-restaurant-viral-in-vijayawada/ ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్…
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం…