ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగాయి. తానేం తక్కువ తినలేదని APSRTC నిరూపిస్తోంది.ప్రయాణికులపై మరోసారి డిజీల్ సెస్ వేసింది ఏపీఎస్ ఆర్టీసీ. ఏప్రిల్ నెలలో డిజీల్ సెస్ వేసింది ఆర్టీసీ.విధిలేని పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ మళ్లీ విధించక తప్పడం లేదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కిలోమీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. విద్యార్ధుల బస్ పాస్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగే అవకాశం వుంది.
డీజిల్, స్పేర్ పార్ట్స్, నిర్వహణ ఖర్చులు పెరగడంతో సెస్ పెంచక తప్పడం లేదంటోంది ఆర్టీసీ. పెరిగిన డీజిల్ ధరల కారణంగా రోజుకు అదనంగా రూ. 2.50 కోట్లు అదనపు భారం పడుతోందని వెల్లడిస్తోంది. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని ఆర్టీసీ కోరుతోంది.రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి పెరిగిన ఆర్టీసీ ధరలు.కిలోమీటర్ల ప్రాతిపదిన సెస్ విధింపునకు నిర్ణయంతో భారీగా టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం వుంది. పల్లె వెలుగు కనీస చార్జీ రూ. 10, పల్లె వెలుగులో తొలి 30 కి.మీ వరుకు నో సెస్. పల్లె వెలుగులో 35-60 కి.మీ వరకు అదనంగా మరో రూ. 5 డీజిల్ సెస్ విధించింది.
పల్లె వెలుగులో 60-70 కిలో మీటర్లు రూ. 10 మేర డీజిల్ సెస్ వుంటుంది. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులలో ప్రస్తుతం టికెట్‌పై రూ. 5 డీజిల్ సెస్ వసూలు చేస్తోంది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు నో సెస్. 31-65 కి.మీ వరకు మరో రూ. 5 మేర డీజిల్ సెస్ విధించనుంది. 66-80 కిలోమీటర్ల వరకు మరో రూ. 10 డీజిల్ సెస్ వుంటుంది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులలోనూ టికెట్‌పై రూ. 10 డీజిల్ సెస్ వసూలు చేయనుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కిలో మీటర్లు వరకు నో సెస్. హైదరాబాద్ -విజయవాడ సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 70 సెస్ విధించనుంది. హైదరాబాద్- విజయవాడ అమరావతి బస్సుల్లో రూ. 80 డీజిల్ సెస్ విధించనుంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతం అవుతున్న వారికి ఇదో అదనపు భారం కానుంది.