తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణకు 100 కోట్లకు పైగా నష్టం కలుగుతుంది. ధరలు తగ్గిస్తే ఖజానాపై పడే భారం గురించి అధికారులు ఆలోచిస్తున్నారు. కేంద్రం తగ్గించగా లేంది మీరు తగ్గిస్తే నష్టం ఏంటి? సామాన్యుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాల వత్తిడి వల్ల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.