కొల్చారం (మం) వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్- జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్(45) మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Promotions…
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొడిమ్యాల మండల కేంద్రంలో ఆవుదుర్తి మమత(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిన స్థితిలో ఇంట్లో ఉన్న దూలానికి మృతదేహాం వేలాడుతోంది. ఇంటి చుట్టూ తాళాలు వేసి ఉన్నాయి. దుర్గంధం వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించారు కాలనీవాసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డోర్ ఓపెన్ చేశారు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం…
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్‌లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్‌గా పోలీసులు గుర్తించారు.
పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.
అతి వేగం ప్రమాదకరం. నిదానమే ప్రదానం. నెమ్మదిగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి. ఇలాంటి హెచ్చరిక బోర్డులు రోడ్లపై నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. మన కంటపడుతుంటాయి.. నిత్యం చదువుతూనే ఉంటాం.
ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తన చేతి మణికట్టు కోసుకుని దాన్ని వీడియో తీసి ప్రేమికుడికి పంపించింది. ఆ యువకుడు ఆస్పత్రికి పరిగెత్తగా.. ప్రియురాలి పరిస్థితి చూసి స్పృహతప్పి పడిపోయాడు.
అమెరికా నుంచి ఇస్తాంబుల్‌కు బయల్దేరిన విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ హఠాత్తుగా ప్రాణాలు వదిలాడు. అయితే వెంటనే న్యూయార్క్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యూఎస్ నుంచి టర్కీకి బయల్దేరింది.